ఘావ్రీ మాట్లాడుతూ.. "వీళ్లు టీమ్ ఇండియాకు ఎంతో చేశారు. ఎన్నో విజయాల్లోకి కీలక పాత్ర పోషించారు. వీళ్ళని టీమ్ మెంబర్స్ పెద్ద దిక్కుగా చూస్తున్నారు అందుకే వీళ్లు భారీ సంఖ్యలో పరుగులు చేయాలి. లేకపోతే, వాళ్లకు టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని అనుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో వీళ్ళు ఇదే తరహాగా ఆడితే, విరాట్, రోహిత్ రిటైర్ అవ్వడం మంచిది. ముందుగా చెప్పినట్లు వీళ్లు భారత క్రికెట్ కోసం చాలా చేశారు. కానీ జట్టు గెలవాలంటే భారీగా పరుగులు అవసరం. భవిష్యత్తు కోసం మనం మంచి జట్టును తయారు చేసుకోవాలి. ఇలా ఆడకపోయిన ఆటగాళ్లను ఎంతకాలం ఉంచుతాం?" అని ప్రశ్నించాడు.
ఆస్ట్రేలియాతో జరిగే బార్డర్-గావస్కర్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌ల కోసం చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే లాంటి మంచి ఆటగాళ్ళని భారత జట్టులో ఎంచుకోలేదు. మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాగా ఆడకపోయినా పుజారా, రహానేలను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 2011-12 సీజన్ తర్వాత మొదటిసారిగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ సిరీస్‌లో వీళ్ళిద్దరు లేకపోవడం విశేషం.
ఘావ్రీ ఇంకా మాట్లాడుతూ "ఆటగాళ్ళు బాగా ఆడుతున్నట్లయితే వారిని జట్టులో ఉంచాలి, లేకపోతే ఎందుకు ఎంచుకోవాలి? బాగా ఆడని ఆటగాళ్ళని ఎంచుకుంటున్నట్లయితే, పుజారా లేదా రహానేలను జట్టులోకి తీసుకోవాలి. రోహిత్, విరాట్ పెద్ద సంఖ్యలో పరుగులు చేయకపోతే, మరి ఎవరు చేస్తారు? ఆస్ట్రేలియా వంటి కష్టమైన పిచ్‌లలో ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడి పెద్ద సంఖ్యలో పరుగులు చేసే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మనకు అవసరం. ఆస్ట్రేలియాలో గెలవాలంటే మనం పెద్ద స్కోర్లు చేయాలి." అని అన్నాడు.