మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ “రిషభ్ పంత్ ఒక్కడే ప్రస్తుత జట్టులో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రోహిత్ శర్మకు తర్వాత అతను చాలా బాగా సరిపోతాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి కష్టమైన పిచ్‌లలో కూడా అతను చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. పిచ్ ఎలా ఉన్నా, స్పిన్ అయినా, ఫాస్ట్ అయినా అతను నమ్మకంగా ఆడుతాడు” అని చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రిషభ్ పంత్ అత్యధిక రన్స్ చేశాడు. భారత జట్టు ఈ సిరీస్ ఓడిపోయినా, పంత్ మాత్రం జట్టుకు ఒకే ఒక్క ఆశాకిరణంలా నిలిచాడు. “రోహిత్ శర్మ తర్వాత భారత జట్టుకు కెప్టెన్‌గా రిషభ్ పంత్ చాలా బాగుంటాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో ఒక లెజెండ్ అవుతాడు. అతని కీపింగ్ చాలా మెరుగుపడింది. పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎలా ఇబ్బంది పడ్డారో మనం చూశాం. ప్రస్తుత ఆటగాళ్లలో పంత్‌కు రోహిత్ శర్మ స్థానంలో టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి కావాల్సిన ప్రతిభ, అనుభవం, నైపుణ్యాలు ఉన్నాయి” అని కైఫ్ అన్నాడు. అతను ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ వరల్డ్ లో పెను సంచలనంగా మారింది. అతని కామెంట్స్ బాగా వైరల్ అవుతుంది పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.