టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఓ పార్టీలో ఏర్పడిన వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారి అతి తక్కువ సమయంలోనే ప్రేమ చిగురించింది. ఇక వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లికి ముందే వీరు రెండేళ్లు డేటింగ్ చేసి ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం వివాహం చేసుకున్నారు.


వీరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని నటాషా, హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది వారికి ఎంతో కఠినమైన నిర్ణయం అని, తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకుంటున్నామని వెల్లడించారు. విడాకులు తీసుకున్నప్పటికీ తమ కుమారుడు అగస్త్యకు కో-పేరెంట్స్ గా ఉంటామని చెప్పారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని తన సొంత దేశం సెర్బియాకు వెళ్ళిపోయింది. ఇక గత కొన్ని రోజుల క్రితమే ముంబై తిరిగి వచ్చింది.


ముంబై వీధుల్లో తన మాజీ బాయ్ ఫ్రెండ్ అలెక్సాన్డర్ ఇలాక్ తో కలిసి చట్టపట్టలేసుకొని తిరుగుతోంది. అంతేకాకుండా వీరికి సంబంధించిన కొన్ని వీడియోలు,  ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇలాక్, నటాషాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియోలో అలెగ్జాండర్, నటాషా డ్రెస్ ను సరి చేస్తున్నాడు.


దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా లో పెట్టి.. మరీ రచ్చ చేశారు అలెగ్జాండర్, నటాషా. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు నటాషా పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి వీడియోలు చేయడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: