టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. క్రికెట్ పరంగా తన జీవితం ఎంతో సక్సెస్ అయినప్పటికీ వైవాహిక జీవితం పరంగా హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు. టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు.


ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా, నటాషా వారి సోషల్ మీడియా అకౌంట్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. అందులో భాగంగా వారు చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని, కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ విడిపోవాల్సి వస్తుందని చెప్పారు. ఇక వారి మూడేళ్ల కుమారుడు అగస్త్య బాధ్యతలను తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. విడాకులు తీసుకున్నప్పటికీ అగస్త్యకు కో పేరెంట్స్ గా ఉంటామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


ఇది కఠినమైన నిర్ణయం అని పేర్కొన్నారు. విడాకుల తర్వాత నటాషా సెర్భియాకు వెళ్లిపోయి మళ్లీ ముంబై తిరిగి వచ్చింది. ఇక్కడ చెట్టాపట్టాలేసుకొని వేరే వ్యక్తితో తిరుగుతూ కనిపిస్తోంది. అతనితో కలిసి ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇక రీసెంట్గా నటాషా సోషల్ మీడియా వేదికగా తన కుమారుడు అగస్త్య కోసమే ఇండియాలో ఉంటున్నారని నటాషా తెలియజేసింది.

తన కుమారుడిని వదిలి సెర్బియాకు వెళ్లే ప్రసక్తే లేదని నటాషా వెల్లడించింది. హార్దిక్, నేను విడిపోయినప్పటికీ మా కుమారుడు అగస్త్య కోసం కుటుంబంగానే ఉంటున్నామని నటాషా తెలియజేసింది. అగస్త్య మా ఇద్దరి ప్రేమను పొందాలని అనుకుంటున్నాడని నటాషా చెప్పింది. అగస్త్య నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని పేర్కొంది. ఒక తల్లికి తన కుమారుడి సంతోషం కన్నా మరి ఏది ముఖ్యం కాదని నటాషా చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: