అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ వేదికగా జరుగుతూ ఉండడంతో ఇక భారత జట్టు అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తూ వస్తుంది. మొన్నటికి మొన్న ఆసియా కప్ నిర్వహణ సమయంలో కూడా తాము పాకిస్తాన్ వెళ్లే ప్రసక్తే లేదని.. కాదు కూడదు అంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని.. లేదంటే తటస్థ వేదికపై భారత్ ఆడే మ్యాచ్ లో నిర్వహించాలని ప్రతిపాదన పెట్టగా.. ఇందుకు ఎసిసి కూడా అంగీకరించి ఇక తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహించింది. కాగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. అయితే ఈ ఐసీసీ టోర్నీకి కూడా పాకిస్తాన్ వెళ్లేందుకు అటు బీసీసీఐ ఇప్పటికే నిరాకరించింది.
తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహిస్తేనే తాము ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాము అంటూ తేల్చేసింది. అయితే ఇక ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఉంది. ఇలా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించిన నేపథ్యంలో తమ మ్యాచ్లను దుబాయిలో ఆడేలా హైబ్రిడ్ షెడ్యూల్ ను పిసిబికి బీసీసీఐ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీంతో ఆర్బిటేషన్ కోర్టును ఆశ్రయించాలని పాకిస్తాన్ నిర్ణయించుకుందట. తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోని ఒక్క మ్యాచ్ ను కూడా ఇతర వేదికలకు తరలించే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహసిన్ నక్వి తేల్చి చెప్పారు. ఏం జరగబోతుందో చూడాలి మరి.