టీమిండియా మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడబోతుంది. వరల్డ్ లోనే బెస్ట్ టీమ్స్ గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా, టీం ఇండియా మధ్య పోరు చూడటానికి క్రికెట్ ప్రపంచం మొత్తం సిద్ధమైంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అటు టీమిండియా ఇటు ఆస్ట్రేలియా జట్లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సిరీస్లో ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు రివ్యూలు ఇచ్చేస్తున్నారు.


 కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీం ఇండియాకు ఒక చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై ఏకంగా న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ అయింది టీమ్ ఇండియా. కొన్ని ఏళ్ల తర్వాత ఇలాంటి చెత్త రికార్డును మూటగట్టుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఎలా రాణిస్తుందో అనే విషయంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇక ఇప్పుడు టీమిండియా లాగానే ఆస్ట్రేలియా కూడా ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ కి ముందు ఒక చెత్త రికార్డును నమోదు చేసింది.


పాకిస్తాన్తో జరుగుతున్న 3 వన్డెలా సిరీస్ లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగటుకుంది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్థ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియ ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమవడంతో.. ఇక చివరికి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిపోయింది. ఇలా మొన్న టీమిండియా.. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రత్యర్ధుల చేతుల్లో చావు దెబ్బతిని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఇరు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: