ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ క్రికెట్ ని అమితంగా ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు క్రీడాభిమణులు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే క్రికెట్కు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది. కాబట్టి అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది. అయితే 2025 ఐపీఎల్ కు సంబంధించి ప్రస్తుతం హడావిడి నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరగబోయే మెగా వేలం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.


 అయితే మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఆటగాళ్లు ఎక్కువ ధర పలకబోతున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. కాగా ఎవరు ఊహించని విధంగా ఎన్నో టీమ్స్ తమ కెప్టెన్లను సైతం వేలంలోకి వదిలేస్తాయి. ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ లు కూడా ఇలా వేలంలో పాల్గొంటూ ఉండడంతో ఆయా స్టార్ ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎలా పోటీ పడతాయి అనే విషయంపై కూడా ఎంతో మంది భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పై దృష్టి సారిస్తాము అంటూ సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. మాకున్న పర్స్ ను బట్టి ఇతర ఫ్రాంచైజిలతో పోటీపడి వారిని కొనడం చాలా కష్టం. అయినప్పటికీ మా ప్రయత్నం మేము చేస్తాం. భారత ప్లేయర్లకు చాలా డిమాండ్ ఉంది అంటూ కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రస్తుతం ధోని కీపింగ్ చేస్తూ ఉండగా ఋతురాజ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. అయితే కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంటే ఈ రెండు బాధ్యతలను ఒక్కరే నిర్వర్తించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl