ఇలాంటి పరిస్థితుల మధ్య రంగంలోకి దిగిన టీమిండియా అదరగొట్టేసింది. ఏకంగా సౌత్ ఆఫ్రికా ను వారి సొంత గడ్డం మీద చిత్తు చేసేసింది. ఏకంగా నాలుగో t20 మ్యాచ్ లో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించింది. భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు సెంచరీ తో చెలరేగిపోవడంతో సౌత్ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు కనిపించాయి అని చెప్పాలి. ఒకవైపు తిలక్ వర్మ సెంచరీ తో చెలరేగిపోగా.. ఇంకో వైపు వరుసగా రెండుసార్లు దకౌట్ అయినా సంజు శాంసన్ సూపర్ కం బ్యాక్ ఇచ్చాడు. మెరుపు సెంచరీ తో అదరగొట్టేసాడు. 56 బంతుల్లోనే 6 ఫోర్లు 9 సిక్సర్లతో 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి విధ్వంసకర శతకం చేశాడు.
అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఇలా సంజూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఏకంగా సంజూ ఒక లేడీ ఫ్యాన్ దవడ పగలగొట్టాడు. అదేంటి అలా ఎందుకు చేస్తాడు అనుకుంటున్నారు కదా. అయితే ఏం జరిగిందంటే సంజూ ఒక భారీ సిక్సర్ కొట్టగా అది ఏకంగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న లేడీ ఫ్యాన్ ముఖానికి వెళ్లి తగిలి దవడ పగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిపోయిన సదరు మహిళ ఐస్ ప్యాక్ పెట్టుకొని కన్నీటి పర్యంతమైంది. ఇక ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన సంజూ ఆమెకు సైగలతో క్షమాపణలు చెప్పాడు. టీమిండియా ఇన్నింగ్స్ 10 ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.