అయితే మరికొన్ని రోజుల్లో ఈ ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే భారత జట్టు అటు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ లో కూడా మునిగి తేలుతుంది. మొన్నటికి మొన్న సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బ తిన్న టీమిండియా జట్టు.. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా అలాంటి పటిష్టమైన టీం ని వారి సొంత గడ్డపై ఎలా ఎదుర్కొంటుంది అన్నది అందరిలో ఉన్న ప్రశ్న. ఈ క్రమంలోనే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కాస్త ఈసారి మరింత ఆసక్తికరంగా మారిపోయింది.
కాగా ఈ ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ లో ఎవరు బాగా రాణిస్తారు ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారు. డేంజరస్ ప్లేయర్ ఎవరు అనే విషయంపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా తమ రివ్యూలను ఇచ్చేస్తూ ఉన్నారు. కాగా ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ గ్లెన్ మెక్ గ్రోత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్టాక్ ప్లేయర్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దు అంటూ ఆస్ట్రేలియా ప్లేయర్లకు సూచించాడు. బిగ్ గేమ్స్ అంటే కోహ్లీ చెలరేగిపోతాడు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్తో సిరీస్ లో విఫలమైనప్పటికీ అతడిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు అంటూ హెచ్చరించాడు. విరాట్ కోహ్లీ జోలికి వెళ్లకుండా ఉంటే అది ఆస్ట్రేలియాకు ఎంతో మేలు అంటూ ఆ జట్టు మాజీ ప్లేయర్ గ్లెన్ మీకు గ్రాత్ సలహా ఇచ్చాడు.