కానీ ఎందుకో అటు rcb కి మాత్రం ఎప్పుడు అదృష్టం కలిసి రాదు. మిగతా టీమ్స్ లో ఉన్నప్పుడు లేదంటే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినప్పుడు అదరగొట్టే ప్లేయర్లు.. అటు rcb తరపున ఆడుతున్న సమయంలో మాత్రం ఎందుకో తడబాటుకు గురవుతు పేలవ ప్రదర్శన చేస్తూ ఉంటారు. దీంతో జట్టు ప్రతిసారి ఎక్కువ ఎన్నో అంచనాల మధ్య బలిలోకి దిగి చివరికి అందరిని నిరాశ పరుస్తూ ఉంటుంది. అయితే 2025 ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టాలి అనే లక్ష్యంతో ఉంది ఆర్ సి బి. ఈ క్రమంలోని ఏకంగా కోచ్ కెప్టెన్ దగ్గర నుంచి పూర్తిగా మార్పు చేసేసింది.
ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కొత్తగా కెప్టెన్సీ చేపట్టబోయేది ఎవరు? ఇక కోచ్ బాధ్యతలు ఎవరు నిర్వహించబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే ఇక ఆర్సిబి కోచ్ గురించి ఇటీవల ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఐపీఎల్ 2025 కోసం ఓంకార్ సాల్విని ఆర్సిబి కొత్త బౌలింగ్ చేసుకుందట. అయితే ప్రస్తుతం ఆయన ముంబై రంజి టీం హెడ్ కోచ్ గా పని చేస్తున్నారు. గతంలో కోల్కతా సపోర్ట్ స్టాఫ్ లోను పనిచేశారు. ఆయన కోచింగ్ లోనే ముంబై గత ఏడాది రంజీ, ఇరానీ ట్రోఫీలు కూడా గెలిచింది. వచ్చే ఏడాది దేశవాళీ టోర్నీ ముగియగానే ఆర్సిబి తో ఆయన జాయిన్ అవుతారు. అయితే డొమెస్టిక్ క్రికెట్లో ఆటగాళ్లలోని సామర్థ్యాన్ని వెలికి తేవడంలో సక్సెస్ అవుతున్న ఆయన పేరు తెగ మారి మోగిపోతుంది అని చెప్పాలి.