క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఏకంగా స్నేహితులతో సరదాగా గడపాల్సిన సమయంలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి దేశం కోసం ప్రాతినిధ్యం వహించాడు. ఏకంగా దేశాన్ని గెలిపించడం కోసం పోరాటయోధుడిగా మారిపోయాడు. క్రికెట్ ఆటను మొదలుపెట్టి ఆ క్రికెట్ కె గాడ్ గా మారిపోయాడు సచిన్ టెండూల్కర్. ఇక ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సచిన్ ను మాస్టర్ బ్లాస్టర్ అని పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు.


 ఇక సచిన్ టెండూల్కర్ కెరియర్ లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఆయన సాధించిన రికార్డులు మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక క్రికెట్ పట్ల సచిన్ టెండూల్కర్ కు ఉన్న నిబద్ధత అంకితభావం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు గాయాలు అయిన సమయంలో కూడా లెక్కచేయకుండా  అటు జట్టును గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించేవాడు. ఈ క్రమంలోనే సచిన్ దేశం కోసం ఆడటం పట్ల ఎంత నిబద్ధతతో ఉండేవాడు అన్న విషయంపై ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు సౌరబ్ గంగూలీ.


 పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ లో పక్కటెముకలు విరిగినప్పటికీ కూడా సచిన్ టెండూల్కర్ జట్టును గెలిపించడం కోసం బ్యాటింగ్ చేశారు అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. మీరు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారు అనే ప్రశ్నకు దాదా ఈ సమాధానం చెప్పాడు. సచిన్ చాలా స్పెషల్. షోయబ్ బౌలింగ్లో పక్కటెముకలకు దెబ్బ తగిలింది. అయినప్పటికీ సచిన్ గాయమైనట్లు చెప్పకుండా దేశం కోసం పరుగులు చేశారు. తర్వాత రోజు ఉదయం చూస్తే రెండు ఫ్రాక్చర్లు అయ్యాయి. ఇక ఈ విషయం తెలిసి సచిన్ అంకితభావానికి అందరూ ఫిదా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: