అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడెందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. మొన్నటికి మొన్న అటు సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ అయింది అన్న విషయం తెలిసిందే. భారత జట్టు ఎలా రాణించబోతుంది అనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొన్నాయి. ఇదిలా ఉంటే అటు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా రోహిత్ భార్య రితిక డెలివరీ ఉన్న నేపథ్యంలో ఈ మధురమైన క్షణాల్లో దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో బీసీసీఐని లీవ్ అడగగా క్రికెట్ బోర్డు పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ లేకుండానే మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బలులోకి దిగేందుకు సిద్ధమవుతుంది.
అయితే రెగ్యులర్ కెప్టెన్ మాత్రమే కాదు రెగ్యులర్ ఓపెనర్ ని కూడా అటు టీమ్ ఇండియా మిస్ కాబోతుంది. దీంతో ఇక రోహిత్ స్థానంలో ఓపెనర్ బరిలోకి దిగబోయే ఆటగాడు ఎవరు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. కాగా బోర్డర్ గవాస్కర్ తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ కు తోడుగా కేఎల్ రాహుల్ ఓపెనర్ బరిలోకి దిగుతాడు అని అంచనా వేస్తున్నాయి. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ.. ఐదవ స్థానంలో రిషబ్ పంత్ ఆడతారని సమాచారం. ఇక ఆరవ స్థానం కోసం సర్పరాజ, జూరేల్ మధ్య పోటీ ఉందట. ఇక ఆల్ రౌండర్ల కోటాలో అశ్విన్, నితీష్ ల మధ్య పోటీ ఉందట.