దీంతో అటు భారత్ మాత్రం పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు హైబ్రిడ్ పద్ధతిలో తటస్థ వేదికపై భారత్ ఆడే మ్యాచ్ లు నిర్వహించాలని పట్టుబడుతుంది. ఈ క్రమంలోనే అటు 2025లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తాము పాకిస్తాన్ కు వెళ్లబోము అంటూ బీసీసీఐ తేల్చి చెప్పింది అయితే హైబ్రిడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మౌనంగా ఉంది. దీంతో ఈ విషయంపై ఏం జరుగుతుందో అనే చర్చ అంతట ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం తెరమీదకి వచ్చింది. ఏకంగా పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధంగా లేక టీమిండియా చివరికి వరల్డ్ కప్ నుంచే తప్పుకుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
పాకిస్తాన్ వేదికగా ఈనెల 23 నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు అందుల t20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే ఈ టి20 వరల్డ్ కప్ నుంచి డిపెండింగ్ ఛాంపియన్ టీం ఇండియా తప్పుకుంది అన్నది తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత అందుల క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. తమతో పాటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు కూడా పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధంగా లేక టోర్ని నుంచి తప్పుకున్నాయి అన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.