ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పింది. భారత్ కూడా ఈ టోర్నీలో పాల్గొనాలి అంటే టీమిండియా ఆడబోయే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలి అంటూ ఇక తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేస్తుంది. అయితే బీసీసీఐ మొండి పట్టుతో అటు ఐసీసీ కూడా ఆలోచనలో పడిపోయింది. తాము ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడికి తరలించే ప్రసక్తి లేదు అంటూ ఇంకోవైపు పిసిబి కూడా మొండి మొండి పట్టుతోనే ఉంది. దీంతో ఏం చేయాలో పాలు పోక చర్చల మీద చర్చలు జరుపుతూ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.
ఇలా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఇప్పటికే బీసీసీఐ పాకిస్తాన్ లో ఆడటానికి నో చెప్పగా హైబ్రిడ్ విధానం పై పాకిస్తాన్ బోర్డు మౌనం పాటిస్తోంది. అయితే దీనిపై స్పష్టత తెచ్చేందుకు ఇప్పుడు ఐసిసి రంగంలోకి దిగింది అన్నది తెలుస్తుంది. ఈవెంట్ జరగాల్సిన పాకిస్తాన్ తో పాటు మిగతా జట్ల బోర్డులతో కూడా చర్చలు జరిపేందుకు సిద్ధమయింది. ఇక ఈ వారంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏం జరగబోతుందో అనే విషయంపై ఉత్కంఠ ఉంది అని చెప్పాలి.