స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు 3-0తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా బాధ్యత వహించాడు. అయితే ఈ ఓటమి రోహిత్ కెప్టెన్సీ, అతని బ్యాటింగ్, విరాట్ కోహ్లీ సహా సీనియర్ ఆటగాళ్లపై ప్రశ్నార్థకాలను లేవనెత్తింది. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఈ సీనియర్ ఆటగాళ్లపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో ఓడిపోయిన భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి జారుకుంది. అంతేకాకుండా ఫైనల్స్‌కు చేరుకునే మార్గం కూడా చాలా కష్టంగా మారింది. ఇప్పుడు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో భారత జట్టు సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాల టెస్ట్ క్రికెట్ భవితవ్యం కాస్త ప్రశ్నార్థకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినియర్స్ ను పక్కనబెట్టాలని డిమాండ్లు పెద్దెత్తున వస్తుండటంతో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో వారి ఆటతీరును బీసీసీఐ స్వయంగా పర్యవేక్షించబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ టీంతోపాటు ఆస్ట్రేలియాలోనే ఉండి కోచ్ గౌతమ్ గంభీర్ తో కలిసి ఈ ముగ్గురి భవిష్యత్తుపై చర్చింవచ్చనే ప్రచారం జోరందుకుంది. దింతో వారికీ ఆడబోయే ఆఖరి సిరీస్ అయ్యే ఛాన్సూ ఉంది.

ఇక మరోవైపు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 4-0తో గెలవాలి. ఈ సమయంలో జట్టు ఒక్క మ్యాచ్‌లో అయినా ఓడిపోతే, జట్టు WTC ఫైనల్‌కు దూరంగా ఉండాల్సిందే. భారత్ ఈ WTC సైకిల్‌కు అర్హత సాధించకపోతే, వచ్చే ఏడాది జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో తదుపరి చక్రం ప్రారంభం కానుంది. దాంతో జట్టుకు పునాది వేయగల ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంచుకోవలసి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: