మెఘాలయా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసిన తర్వాత ఢిల్లీ జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ 81 ఓవర్లలో 2 వికెట్లకు 468 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ అజేయంగా నిలిచి, ధన్య నక్రా 98 పరుగులతో సెంచరీకి త్వరలో ఉన్నాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ జట్టు బలమైన స్థితిలో ఉంది.
ఇది ఆర్యవీర్ వార్తల్లో నిలవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. అక్టోబర్‌లో వీను మంకడ్ ట్రోఫీలో మణిపూర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులు చేసి ఢిల్లీ జట్టుకు ఆరు వికెట్ల తేడాతో విజయం అందించాడు. వీరేంద్ర సెహ్వాగ్ గతంలో చాలా సందర్భాల్లో పిల్లల గురించి మాట్లాడాడు. తన పిల్లలపై క్రికెట్ ఆడాలనే ఒత్తిడి తెచ్చేవాడిని కాదని ఎప్పుడూ చెప్పేవారు. తన పిల్లలు ఏ రంగంలోనైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటారని, క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావాలని అనుకోవడం లేదని చెప్పేవారు. అయితే మంచి మనుషులుగా ఉండాలనేది మాత్రం చాలా ముఖ్యమని ఎప్పుడూ గుర్తు చేసేవారు.
కూచ్ బెహార్ ట్రోఫీ భారతదేశంలోని అండర్-19 క్రికెటర్లకు చాలా ముఖ్యమైన టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ద్వారా ఎంపికైన ఆటగాళ్లకు ఉన్నత స్థాయి క్రికెట్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. ఆర్యవీర్ సెహ్వాగ్ ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడి తన ప్రతిభను చూపించాడు. ఆయన భవిష్యత్తులో క్రికెట్‌లో మంచి స్థాయికి ఎదగగలడనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.