అవును, కొంతమంది ఆటగాళ్లు అత్యంత తక్కువ ధరలకే అమ్ముడుపోయారు. వాళ్ల స్టార్‌డమ్‌తో పోలిస్తే దక్కిన మొత్తం తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ టాప్‌లో ఉన్నాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన రాహుల్ కనీసం రూ.20 కోట్లు పలుకుతాడని అందరూ అంచనా వేశారు. కానీ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకే సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. రాహుల్ కోసం ఆర్సీబీ-కేకేఆర్ తొలుత పోటీపడ్డాయి. రూ.10 కోట్లు మార్క్‌ను అందుకోవడంతో బెంగళూరు, కేకేఆర్ ఫ్రాంచైజీలు వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత సీఎస్కేతో ఢిల్లీ పోటీపడి అంతిమంగా దక్కించుకుంది.
అదేవిధంగా న్యూజిలాండ్ ప్లేయర్లు డెవాన్ కాన్వే (రూ. 6.25 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు)తో దక్కించుకోవడం మంచి చౌక బేరమే అని సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత స్టార్ యువ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి ని రూ. 3.40 కోట్లకే తగ్గించుకోవడం విశేషం. ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్‌క్రమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కేవలం తన కనీస ధర రూ.2 కోట్లకే సొంతం చేసుకోవడం విశేషం. అలాగే అఫ్గానిస్థాన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (రూ.2 కోట్లు)ను కేకేఆర్ తక్కువ ధరకు సొంతం చేసుకుంది.
తక్కువ ధరకు అమ్ముడుపోయిన స్టార్ ప్లేయర్స్:
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)
లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్‌సీబీ)
కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
ఎయిడెన్ మార్క్‌రమ్-రూ. 2 కోట్లు(లక్నో)
డేవాన్ కాన్వే- 6.25 కోట్లు (సీఎస్‌కే)
రాహుల్ త్రిపాఠి-రూ. 3.40 కోట్లు(సీఎస్‌కే)
రచిన్ రవీంద్ర-రూ. 4 కోట్లు(సీఎస్‌కే)
మిచెల్ మార్ష్- రూ. 3.4 కోట్లు(లక్నో)
గ్లేన్ మ్యాక్స్‌వెల్-రూ. 4.20 కోట్లు(పంజాబ్)
క్వింటన్ డికాక్-రూ. 3.60 కోట్లు(కేకేఆర్)
రెహ్మానుల్లా గుర్బాజ్- రూ. 2 కోట్లు(కేకేఆర్).