అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్ కు ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే  కేవలం నిమిషాలు వ్యవధి లోనే మ్యాచ్ ఫలితం ఏంటో తేలిపోతూ ఉండడంతో.. అటు ప్రేక్షకులు కూడా ఈ పొట్టి ఫార్మాట్ ను చూసేందుకే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. టి20 ఫార్మాట్ అంటే ప్రేక్షకులందరికీ కావాల్సిన బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ ఉరుములు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం టీ20 మ్యాచ్లలో కూడా ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి.


 రెండు టీమ్స్ తలబడిన సమయంలో ఒక జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి భారీ స్కోర్ చేస్తే.. ఇంకో టీం మాత్రం కనీసం పోటీ ఇవ్వలేక చెత్త ప్రదర్శన చేసి దారుణమైన ఓటమిని చవిచూస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఓటమి గురించే. అయితే ఇలాంటి ఓటమిని మీరు ఇప్పటివరకు కనీ వీని ఎరిగి ఉండరు. ఎందుకంటే టి20 ఫార్మాట్లో కేవలం ఒక టీం ఏడు పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఇకంగా 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు ఏడు పరుగులకే ఆల్ అవుట్ అవ్వడంతో.. ప్రత్యర్థ టీం 264 పరుగుల తేడాతో గెలుపొందింది.


 దీంతో అంతర్జాతీయ టి20లో అత్యల్ప స్కోర్ నమోదయింది. టీ20 వరల్డ్ కప్ 2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫైయర్ పోటీలో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్లో ఐవరీ కోస్ట్ అనే జట్టు ఏడు పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే గతంలో ఈ చెత్త రికార్డు ఐసిల్ ఆఫ్ మ్యాచ్, మంగోలియా జట్ల పేరిట ఉండేది. ఈ రెండు టీమ్స్ గతంలో టి20 మ్యాచ్ లు పది పరుకులకే ఆల్ అవుట్ అయ్యాయి. కానీ ఇటీవల నైజీరియాతో  జరిగిన మ్యాచ్లో ఐవరి ఆఫ్ కోస్ట్ ఏడు పరుగులకే కుప్ప కూలిపోయింది. దీంతో టీ20 క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డు నమోదయింది. ఇక ఈ మ్యాచ్ గురించి తెలిసి క్రికెట్ ప్రేక్షకులందరూ  కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కాగా ఐవరీ  ఆఫ్ కోస్ట్ ఇన్నింగ్స్ లో ఆరుగురు డక్ అవుట్ కాగా ముగ్గురు బ్యాట్స్మెన్లు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్  మహమ్మద్ చేసిన 4 పరుగులతో ఇక ఆ జట్టు ఏడు పరుగులు చేయగలిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: