అయితే ఇక ఇలా మెగా వేలం జరుగుతున్న సమయంలో టాలెంటెడ్ క్రికెటర్ ఎవరైనా ఈ వేలంలో పాల్గొన్నారు అంటే చాలు ఎన్నో ఫ్రాంచైజీలు అలాంటి వారిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇతర టీం యాజమాన్యాలతో పోటీ పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే ముగిసిన మెగా వేలంలో మాత్రం ఒక టాలెంటెడ్ ప్లేయర్కు అన్యాయమే జరిగింది. అతనికి టన్నుల కొద్ది పరుగులో ఉన్న ఇక బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ జట్టు యాజమాన్యం అతని పట్టించుకోలేదు. దీంతో అతను అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు.
అతను ఎవరో కాదు సర్ఫరాజ్ ఖాన్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన ఈ యంగ్ ప్లేయర్ ను అటు ఐపీఎల్ వేలంలో మాత్రం దురదృష్టం వెంటాడింది. స్టార్ హిట్టర్గా పేరు పొందిన సర్పరాజ్ ప్రస్తుతం టీమిండియా తరఫున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంటున్నాడు. అయినప్పటికీ అతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు. 75 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చినప్పటికీ సర్ఫరాజ్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. గతంలో అతడు ఆర్సిపి, పంజాబ్, ఢిల్లీ తరఫున ఆడాడు. అయితే సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ ను మాత్రం పంజాబ్ జట్టు 30 లక్షల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసింది అని చెప్పాలి.