విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా ఈ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. కానీ ఊహించని రీతిలో ఈ టీం ని దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కూడా.. ఇక ఆ జట్టు చెత్త ప్రదర్శన చేసి కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టకుండానే ఐపిఎల్ నుంచి నిష్క్రమిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఇదే జరగడం ఈ కామన్ గా కొనసాగుతూ వస్తుంది. అయితే 2025 ఐపీఎల్ సీజన్ కోసం పక్క ప్లాన్ తో బరిలోకి దిగెందుకు సిద్ధమైంది ఆర్సిబి. దీంతో ఇక కెప్టెన్ డూప్లెసెస్ ను సైతం వేలంలోకి వదిలేసింది..
ఇక ఇటీవలే మెగా వేలంలో ఎంతోమంది కొత్త ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకుంది. ఇటీవల వేలం పూర్తయిన నేపథ్యంలో ఇక ఆర్సిబి జట్టుకు మళ్ళీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపడతాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే వేలంలో ఆ జట్టులోకి వచ్చిన ఆటగాళ్లలో ఎవరూ కూడా కెప్టెన్సీ చేపట్టేందుకు అర్హత కలిగిన ఆటగాళ్లు లేకపోవడం.. ఇంకోవైపు విరాట్ కోహ్లీ అందులో సీనియర్ కావడంతో మరోసారి ఆర్సిబి కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లీ చేతికే వస్తాయని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అటు ఆ జట్టు అభిమానులు కూడా కోహ్లీ కెప్టెన్ అయితే అంతకంటే మాకు ఏం కావాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.