రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ తమ మునుపటి జట్లతో విభేదాల కారణంగా వేలంలోకి వచ్చారు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఐపీఎల్ టైటిల్‌కు నడిపించిన శ్రేయస్ అయ్యర్, పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా, రిషభ్ పంత్ ఎల్‌ఎస్‌జీ జట్టుకు కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్‌ను తమ జట్టులోనే ఉంచుకోవడానికి ప్రయత్నించింది. దీనికోసం రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించి 20.75 కోట్ల రూపాయలు బిడ్ చేసింది. అయితే, ఎల్‌ఎస్‌జీ తన బిడ్‌ను 27 కోట్ల రూపాయలకు పెంచడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ బిడ్‌కు సమానంగా బిడ్ చేయలేకపోయింది. దీంతో రిషభ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు.
2022 ఐపీఎల్ వేలంలో మొత్తం 204 మంది క్రికెటర్లు అమ్ముడుపోయారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్‌ను 15.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అదేవిధంగా, భారతీయ పేస్ బౌలర్ దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కొల్‌కతా నైట్ రైడర్స్ జట్టు శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. విదేశీ ఆటగాళ్ళైన లియామ్ లివింగ్‌స్టోన్, వానిందు హసరంగ, నికోలస్ పూరన్ వంటి వారు కూడా భారీ మొత్తాలకు అమ్ముడుపోయారు. అలాగే, అన్‌క్యాప్డ్ ఆటగాళ్ళలో అవేష్ ఖాన్ అత్యధిక ధర పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతన్ని 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.