ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఇటీవల ఫిలిప్ హ్యూస్‌ను గుర్తు చేసుకుంది. 2014 నవంబర్‌లో, సిడ్నీ క్రికెట్ మైదానంలో ఒక మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో అతని తలకు బంతి బలంగా తగిలింది. ఈ ఘటనలో అతను తీవ్రగాయాలతో రక్తస్రావమయి మరణించాడు. అతనికి అప్పుడు కేవలం 25 ఏళ్లే. ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆటగాళ్ల భద్రత గురించి చాలా చర్చలు జరిగాయి. ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ, క్రికెట్ అభిమానులు, ఫిలిప్ హ్యూస్‌తో కలిసి ఆడిన ఆటగాళ్లు, అతని కుటుంబ సభ్యులు అతన్ని మరచిపోలేకపోతున్నారు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున 26 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఫిలిప్ హ్యూస్ తన ప్రతిభతో చాలామందిని అలరించాడు. మైదానంలో కుప్పకూలిపోయిన హ్యూస్‌ను ఆటగాళ్లు, వైద్యులు ఎంతో ఆందోళనతో సహాయం చేస్తున్న చిత్రాలు క్రికెట్ అభిమానుల మనసుల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. హ్యూస్ మరణం క్రీడా ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆటగాళ్ల భద్రత కోసం మరింత మెరుగైన రక్షణ చర్యలు తీసుకోవాలని అందరూ కోరారు.

పాకిస్థాన్‌కు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, వసీం రాజా కూడా మైదానంలో మరణించాడు. అతనికి మైదానంలోనే గుండెపోటు వచ్చింది. 1973-85 మధ్య 12 సంవత్సరాల పాటు 57 టెస్టులు, 54 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. రాజా 2006లో గుండెపోటుకు గురై విషాదకరంగా మరణించాడు. రిచర్డ్ బ్యూమాంట్ అనే ప్లేయర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మరణించాడు. ఈ ఇంగ్లండ్ ఆటగాడు 1979-2012 మధ్య మ్యాచ్ లు ఆడాడు. 1986-89 మధ్యకాలంలో 4 టెస్టులు, 32 ODIలలో ఆడిన టీమిండియా ప్లేయర్ లాంబా కూడా మైదానంలోనే కన్నుమూశాడు. ఆ సమయంలో ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో హెల్మెట్ లేకుండా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేశాడు. అప్పుడు బంతి తలకు తగలడంతో తనువు చాలించాడు.  పాకిస్థాన్ క్రికెటర్ జుల్ఫికర్ భట్టి 22 ఏళ్లకే బంతి తగిలి మరణించాడు. ఆల్క్విన్ జెంకిన్స్ (72) అనే ఇంగ్లీష్ అంపైర్ 2009లో ఫీల్డర్ వేసిన బంతి తగలడంతో అతని ప్రాణం పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: