వైభవ్ నాగ్‌పూర్‌లోని రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు. జట్టు సీఈవో జేక్ లష్ మెక్‌క్రం అతన్ని ప్రశంసించారు. "అతను అద్భుతమైన ప్రతిభావంతుడు, గొప్ప భవిష్యత్తు ఉన్నవాడు. IPL ప్రమాణాలకు అనుగుణంగా ఉండటానికి కష్టపడాలి. అయినప్పటికీ, అతన్ని మా జట్టులో చేర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది" అని మెక్‌క్రం అన్నారు. అయితే, 13 ఏళ్ల బాలుడు ఐపీఎల్‌లో ఆడటం చట్టబద్ధమా అనే విషయంపై కొందరు ప్రశ్నిస్తున్నారు.
వైభవ్ ని IPLలో చేర్చుకోవడం చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండాలి. అయితే, IPL కి ఇలాంటి నిబంధనలు లేవు. అలాగని, వైభవ్ ను ఇప్పుడే IPLలో ఆడిస్తారా అంటే కష్టమే అని చెప్పుకోవచ్చు. అతని ఆడించాలా వద్దా అనేది రాజస్థాన్ రాయల్స్ టీమ్ చేతుల్లోనే ఉంటుంది. మైధానంలోకి వచ్చే అతడు ఆడకపోయినా రాజస్థాన్ రాయల్స్ వంటి జట్టులో శిక్షణ తీసుకోవడం వల్ల అతనికి చాలా అనుభవం వస్తుంది.
పాకిస్తాన్‌కు చెందిన హసన్ రజా 14 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్ ఆడిన ఉదాహరణ ఉంది. కానీ, ఆ సమయంలో ఇలాంటి నిబంధనలు లేవు. ఇప్పుడు మాత్రం క్రికెటర్ల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఈ నిబంధనలు తీసుకొచ్చారు. వైభవ్ సూర్యవంశి ఇప్పటికే చాలా ప్రతిభను చూపించాడు. అయితే, IPL స్థాయిలో రాణించాలంటే ఇంకా చాలా కష్టపడాలి. అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.