IPL 2025 మెగా వేలం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఉమేష్ యాదవ్ వంటి స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత మంచి ఆటగాళ్లను ఒక్క టీం కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం నిజంగా షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. వేలం గదిలో వీరి పేర్లు రాకపోవడంతో సైలెన్స్ ఆవహించింది. అందరూ నమ్మలేని స్థితిలో ఉన్నారు. అయితే వీరు అమ్ముడుపోకపోవడానికి ముఖ్యమైన కారణం ఫ్రాంచైజీలు మొహమాట పడకపోవడమే అని తెలుస్తోంది ఇంతకుముందు అంత పెద్ద స్టార్ క్రికెటర్లను కొనకపోతే వారు ఏమైనా అనుకుంటారేమో అని మొహమాటంతో కొన్నారు. రిటైన్ చేసుకున్నారు కానీ ఈసారి మాత్రం మొహమాటమనేదే చూపించలేదు.

IPL 2025 వేలంలో ముజీబ్ ఉర్ రహ్మాన్, డేరిల్ మిచెల్, పియుష్ చావ్లా కూడా అన్‌సోల్డ్ లిస్టులో చేరిపోయారు. ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలం పాటకు పెట్టినా, ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. అదేవిధంగా, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో ఆడిన డేరిల్ మిచెల్ కూడా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలం పాటకు వచ్చినా అమ్ముడుపోలేదు. గతంలో ఈ ఆటగాడు చాలా ఎక్కువ ధరకు అమ్ముడుపోయినప్పటికీ, ఈసారి మాత్రం దురదృష్టం ఎదురైంది. అంతేకాకుండా, స్పిన్నర్ పియుష్ చావ్లాను కూడా రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలం పాటకు పెట్టినా, ఏ జట్టు కూడా కొనడానికి ముందుకు రాలేదు.

డేవిడ్ వార్నర్‌ను ఎవరూ కొనకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకుముందు IPL లో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఆడిన వార్నర్, ఈసారి రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలం పాటకు వచ్చినా ఎవరికీ అమ్ముడుపోలేదు. అదేవిధంగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి, చాలా మంచి ఆట ఆడిన కేన్ విలియమ్సన్‌ను కూడా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలం పాటకు పెట్టినా ఎవరూ కొనలేదు. ఉమేష్ యాదవ్, నవీన్-ఉల్-హక్, ముస్తాఫిజుర్ రహ్మాన్ (రూ. 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు) వంటి ఫాస్ట్ బౌలర్లకు సైతం నిరాశే ఎదురయ్యింది. వీరంతా కూడా ఇప్పుడు చాలా బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈసారి కుర్రాళ్లకు యంగ్ ప్లేయర్లకు బాగా అవకాశం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: