మరో విషయం ఏంటంటే ఆటగాడు ఆ సీజన్ మొత్తం ఆడాలని లేదు. కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడొచ్చు. కానీ అతడు ప్రతి మ్యాచ్ ఆడటానికి అందుబాటులో ఉన్నట్లయితే ఆయనకు వేలంలో నిర్ణయించిన మొత్తం కాంట్రాక్ట్ ముగిసే దాకా చెల్లించాలి. అంటే ఆటగాడు ఒక్క మ్యాచ్ ఆడినా, మొత్తం సీజన్ ఆడినా, ఆయనకు నిర్ణయించిన జీతం మొత్తం దొరుకుతుంది. కానీ, ఆటగాడు ఆరోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ఆడకపోతే మాత్రం కొన్ని రూల్స్ వర్తిస్తాయి.
IPL మొదలైన మొదటి కొన్ని సంవత్సరాలలో, ఆటగాళ్ల జీతాలను అమెరికన్ డాలర్లలో లెక్కించేవారు. కానీ, 2012 నుండి ఈ పద్ధతిని మార్చి, అన్ని జీతాలను భారతీయ రూపాయల్లోనే చెల్లించడం మొదలుపెట్టారు. ఒక ఆటగాడు తన జట్టులోనే మరో సీజన్ కొనసాగాలనుకుంటే, ఆయనకు మునుపటి సీజన్‌లో లభించిన జీతమే మళ్లీ ఇస్తారు. అయితే, కొన్నిసార్లు జట్టు యాజమాన్యం బాగా ఆడిన ప్లేయర్‌ను ప్రోత్సహించడానికి ఆయన జీతాన్ని పెంచవచ్చు.
సీజన్ మొదలయ్యే ముందు ఒక ఆటగాడు గాయపడితే, ఆయనకు జీతం చెల్లించరు. ఎందుకంటే, ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోతున్నాడు. సీజన్ మధ్యలో ఒక ఆటగాడు గాయపడితే, ఆయనకు ఆయన ఆడిన రోజులకు తగినంత మొత్తంలో జీతం చెల్లిస్తారు. అంతేకాకుండా, ఆయనకు వచ్చిన వైద్య ఖర్చులను జట్టు భరిస్తుంది. ఇలా ఇంజురైన ఆటగాడు సీజన్ మొత్తంలో అందుబాటులో లేకపోయినా, కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడితే, ఆ ప్లేయర్ కు ఆడిన రోజులకు తగినంత మొత్తంలో జీతం చెల్లిస్తారు. అంతేకాకుండా, 10% రిటైనర్ ఫీ అనేది కూడా ఇస్తారు.