ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి, శుక్రవారం, నవంబర్ 29న భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగింది. డిసెంబర్ 5 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు ఈ జెర్సీని ఆవిష్కరించారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ, కొత్త లుక్ తెచ్చిపెట్టిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయిందని అంటున్నారు.

ఈ కొత్త జెర్సీలో భుజాలపై మూడు రంగుల తివర్ణ పతాకం ఉండటం ప్రత్యేకత. ముందు జెర్సీలో మూడు తెల్లటి చారలు మాత్రమే ఉండేవి. డిసెంబర్ 22 నుంచి 27 వరకు వడోదరలో జరగనున్న వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే మ్యాచ్‌లలో భారత మహిళా జట్టు తొలిసారిగా ఈ కొత్త జెర్సీని ధరించనుంది. జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, "ఈ జెర్సీని ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉంది. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో మేమే తొలిసారిగా దీన్ని ధరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ జెర్సీ డిజైన్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాక రంగులు చాలా అందంగా ఉన్నాయి. ఇది చాలా ప్రత్యేకమైన వన్డే జెర్సీ" అని అన్నారు.

మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో ఆడే మ్యాచ్‌లకు ముందు ఆస్ట్రేలియాలో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. 2023 నుంచి అడిడాస్ భారత క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ఉంది. అప్పటి నుంచి జట్టు తరచూ తమ జెర్సీలను మార్చుకుంటూ వస్తోంది. గత ఏడాది పురుషుల వన్డే ప్రపంచ కప్‌కు, ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌కు ప్రత్యేక జెర్సీలను తీసుకొచ్చారు. అంతేకాకుండా, బ్లూ కలర్ కాలర్‌తో కూడిన తెల్లటి పోలో షర్టు వంటి భారత జట్టు ప్రాక్టీస్ కిట్‌లు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. నవంబర్ 28న, పురుషుల జట్టు ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్‌కు వెళ్లినప్పుడు ఈ తెల్లటి పోలో షర్టు ధరించారు. అక్కడ వారిని ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ ఆహ్వానించారు.










మరింత సమాచారం తెలుసుకోండి: