ప్రపంచ దేశాలలో క్రికెట్ కి ఉన్న ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతూ పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు వరల్డ్ క్రికెట్లో తమ సత్తా ఏంటో చూపించాలని ఆశ పడుతూ ఉన్నాయి. ఇక ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు క్రికెట్ ని అమితంగా ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. అయితే క్రికెట్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఈ ఆటలో ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు సృష్టించిన రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.


 క్రికెట్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న ఇండియాలో అయితే ఇక ఇప్పటివరకు అన్ బ్రేకబుల్ రికార్డులుగా మిగిలిపోయినవి ఏంటి అనే విషయంపై చర్చ జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అన్ బ్రేకబుల్ రికార్డులు అనే మాట వినపడగానే ముందుగా క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అతి తక్కువ వయసులోనే టీమ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు టీం ఇండియా తరఫున ఆడాడు. ఇక ఏ ఆటగాడికి సాధ్యం కానన్ని రికార్డులు నెలకొల్పాడు. ఆయన ప్రస్తుతం రిటైర్ అయినప్పటికీ ఆయన సాధించిన రికార్డులు మాత్రం ఇంకా పదిలంగానే ఉన్నాయి.


 అందులో కొన్ని అన్ బ్రేకబుల్ రికార్డులు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సచిన్ మాత్రమే కాదు సచిన్ కంటే ముందే మరో క్రికెటర్ ఇలాంటి అన్ బ్రేకబుల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ 64 ఏళ్లు గడుస్తున్న ఆ రికార్డును ఏ ఆటగాడు టచ్ కూడా చేయలేకపోయాడు. 1964లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ని ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్ లో వరుసగా 21 మేడిన్ ఓవర్లు వేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 32 ఓవర్లు వేసిన అతను కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ రికార్డు ఇప్పటికి అన్ బ్రేకబుల్ గా ఉంది. ఏ ఆటగాడు కనీసం ఈ రికార్డుకు చేరువలోకి కూడా వెళ్లలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: