ప్రస్తుతం పీవీ సింధు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది రియో ఒలంపిక్స్, టోక్యో ఒలంపిక్స్ లో కూడా పతాకాలను గెలిచినటువంటి ఈమె త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోందట. రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ మధ్యనే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ అనే టైటిల్ని కూడా గెలుచుకున్నట్లు సమాచారం.. ఇప్పుడు మరొకసారి పెళ్లి విషయంతో అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. పీవీ సింధు వివాహం చేసుకోబోయే వారికి పోసిడెక్స్ టెక్నాలజీ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారట..
వీరిద్దరి వివాహం ఈనెల 22న ఉదయపూర్ లో చాలా గ్రాండ్గా బంధువుల సమక్షంలో కొంతమంది పెద్దల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం.డిసెంబర్ 20 వ తేదీ నుంచి పెళ్లి పనులు కూడా మొదలు కాబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే డిసెంబర్ 24న హైదరాబాదులో రిసెప్షన్ తో పాటు విందు కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం. అక్కడికి చాలామంది సెలబ్రిటీలతోపాటు పలువు రాజకీయ నాయకులూ కూడా రాబోతున్నారట. గడిచిన నెల క్రితమే ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.. ముఖ్యంగా జనవరి నెలలో పీవీ సింధుకు బీవీ షెడ్యూల్ ఉండడం వల్ల ఈ నెలలోనే వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట..మరి అందుకు సంబంధించి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.. ప్రస్తుతమైతే ఈ విషయం అటు అభిమానులను ఖుషి చేస్తోంది.