డిసెంబర్ 6 తేదీ భారతీయ క్రికెట్‌కు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజే టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్‌ల పుట్టిన రోజులు వస్తాయి. ముగ్గురు ఒకే రోజు పుట్టడం చాలా ఆశ్చర్యకరం. అభిమానులు కూడా ఈరోజే ఈ ముగ్గురు పుట్టినరోజులు అని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. అయితే బుమ్రా ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు. ఇద్దరూ ఒకేసారి పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఉంది. శ్రేయర్‌ మాత్రం ఆస్ట్రేలియా టూర్ కి సెలక్ట్ కాలేదు. క్రీడా మైదానంలో తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముగ్గురు క్రికెటర్లు, క్రికెట్, యాడ్స్ ద్వారా భారీగా సంపాదించారు. నేడు వీరి బర్త్ డే సందర్భంగా వారి సంపద, ఇప్పటిదాకా సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.

జస్ప్రీత్ బుమ్రా 1993 డిసెంబర్ 6న అహ్మదాబాద్‌లో జన్మించాడు. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరు. భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఒప్పందం, IPL, మ్యాచ్ ఫీజు, వివిధ బ్రాండ్‌ల ప్రచారాల ద్వారా ఆయన భారీగా సంపాదిస్తున్నారు. ముంబై, అహ్మదాబాద్‌లో ఆయనకు ఆస్తులు ఉన్నాయి. ఆయన మొత్తం ఆస్తులు సుమారు 60 కోట్ల రూపాయలుగా అంచనా.

రవీంద్ర జడేజా 1988 డిసెంబర్ 6న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని నవగాం గ్రామంలో జన్మించాడు. జడేజా భారతదేశంలోని బెస్ట్ ఆల్‌రౌండర్‌లలో ఒకరు. జామ్‌నగర్‌లో ‘రాయల్ నవఘన్’ అనే పెద్ద బంగ్లాలో తన కుటుంబంతో కలిసి జడేజా నివసిస్తున్నారు. ఆయనకు మరో మూడు ఇళ్ళు, గుర్రపు స్వారీ చేయడానికి ఒక అద్భుతమైన ఫామ్‌హౌస్ కూడా ఉన్నాయి. జడేజా మొత్తం ఆస్తులు సుమారు 120 కోట్ల రూపాయలుగా అంచనా. ఇది బుమ్రా కంటే రెట్టింపు.

డిసెంబర్ 6న పుట్టిన మరో క్రికెటర్‌ శ్రేయస్ అయ్యర్. 1994లో ముంబైలో జన్మించిన శ్రేయస్ అయ్యర్ తన స్టైలిష్ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నారు. ఇటీవల జరిగిన IPL 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఆయన్ని రూ.26.75 కోట్లకు కొనుగోలు చేయడంతో IPL చరిత్రలో రెండవ అత్యధిక ధర పలికిన ఆటగాడుగా నిలిచారు. bcci ఒప్పందం మరియు వివిధ బ్రాండ్‌ల ప్రచారాలతో కలిపి శ్రేయస్ అయ్యర్ మొత్తం ఆస్తులు సుమారు 80 కోట్ల రూపాయలుగా అంచనా. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురు క్రికెటర్లు తమ అద్భుతమైన ప్రతిభతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు

మరింత సమాచారం తెలుసుకోండి: