రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రన్స్ చేసే విషయంలో చాలా కష్ట పడిపోతున్నాడు. ఈ టీం ఇండియా  కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో వరస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అడిలైడ్ వేదికగా  ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆయన ఎంత పూరెస్ట్ ఫామ్ లో ఉన్నాడో స్పష్టంగా తెలిసింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత, రోహిత్‌ను ఆరవ బ్యాట్స్‌మన్‌గా బ్యాటింగ్ కు దింపారు.

మొదటి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. రెండవ ఇన్నింగ్స్‌లో 15 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. రెండవ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చారు. కానీ, ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ ఆయన వికెట్‌ను తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో స్కాట్ బోలండ్ రోహిత్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశారు.

రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో బ్యాటింగ్ విషయంలో ఇలా ఫెయిల్ అవుతుండటంతో అభిమానుల్లో చాలా ఆందోళనలు నెలకొన్నాయి. అసలు ఏమైంది భయ్యా నీకు? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండవ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేసినప్పటికీ, బౌలర్ నో-బాల్ వేసినందున రోహిత్‌కు మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ, ఆ తర్వాత త్వరగానే అవుటయ్యారు.

రోహిత్ శర్మ ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ మాత్రమే కాదు, గత కొన్ని సిరీస్‌ల నుంచి ఆయన ఫామ్ లో కనిపించలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 6, 5, 23, 8 పరుగులు మాత్రమే చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా ఆయన 2, 52, 0, 8, 18, 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మొదటి రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 3, 6 పరుగులు మాత్రమే చేశారు. గత 12 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ కేవలం 142 పరుగులు మాత్రమే చేశారు. అంటే, ప్రతి ఇన్నింగ్స్‌కు సగటున 11.83 పరుగులు మాత్రమే. ఆయన 12 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది సార్లు 10 పరుగుల కంటే తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 20 పరుగులకు పైగా స్కోర్ చేసినది కేవలం రెండు సార్లు మాత్రమే. అయితే రోహిత్ అభిమానులు ఓపికగా ఉండాలని త్వరలో అతను మళ్లీ అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫామెన్స్ కనబరిస్తాడని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: