అవును, టీ20 క్రికెట్‌లో షమీ అరుదైన ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కాడు. పొట్టి ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. విషయం ఏమిటంటే... సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీయడంతో టీ20ల్లో షమీ వికెట్ల సంఖ్య 201కి చేరింది. ఇకపోతే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ తొలి స్థానంలో ఉన్నాడన్న సంగతి మీరు వినే ఉంటారు.
ఇక టీ20ల్లో 200 ఫ్లస్ వికెట్లు తీసిన భారత బౌలర్ల లిస్టు ఒకసారి పరిశీలిస్తే..
యుజ్వేంద్ర చాహల్ (364 వికెట్స్)
పీయూశ్ చావ్లా (319 వికెట్స్)
భువనేశ్వర్ కుమార్ (310 వికెట్స్)
రవిచంద్రన్ అశ్విన్ (310 వికెట్స్)
అమిత్ మిశ్రా (285 వికెట్స్)
హర్షల్ పటేల్ (244 వికెట్స్)
హర్భజన్ సింగ్ (235 వికెట్స్)
జయదేవ్ ఉనద్కత్ (234 వికెట్స్)
అక్షర్ పటేల్ (233 వికెట్స్)
రవీంద్ర జడేజా (225 వికెట్స్)
సందీప్ శర్మ (214 వికెట్స్)
అర్షదీప్ సింగ్ (203 వికెట్స్)
ఉమేశ్ యాదవ్ (202 వికెట్స్)
మహ్మద్ షమీ (201 వికెట్స్)
కుల్దీప్ యాదవ్ (200 వికెట్స్)