టీమ్‌ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్‌ శర్మ, జరగబోయే మ్యాచ్లో ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడన్న విషయంపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈమధ్య ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టుకి రోహిత్‌ హాజరు కాకపోవడంతో అతడి ప్లేసులో కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్గా దిగడం జరిగింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌తో కలిసి రాహుల్ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో రోహిత్ స్థానంలో క్రమంలో అతడినే ఓపెనర్‌గా కొనసాగించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే అడిలైడ్‌లో డే నైట్‌ టెస్టులో రోహిత్‌ 6వ స్థానానికి పరిమితం అయ్యాడు. కానీ ఆ ఇన్నింగ్స్లో రాహుల్‌, రోహిత్‌ ఇద్దరూ ఫెయిల్ కావడంతో అందరూ అవాక్కయ్యారు.

ఈ క్రమంలోలో గత 6 సంవత్సరాలుగా ఓపెనర్‌గా విజయవంతమైన ఆటలు ఆడిన రోహిత్‌ బ్యాటింగ్‌ స్థానాన్ని మార్చడం సరికాదంటూ ఓ వైపు అభిమానులు, మరోవైపు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్, రవిశాస్త్రి సహా చాలామంది మాజీలు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని వేలెత్తి చూపడం జరిగింది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే 3వ టెస్టులో రోహిత్‌ ఓపెనర్‌గా వస్తాడా? లేదా? అనే విషయంలో సర్వత్రా సందిగ్దత నెలకొంది. మరోవైపు అటువంటి ఉద్దేశమేమి ఉన్నట్టు కనబడడం లేదు కూడా. మరోవైపు బ్రిస్బేన్‌లో 14న మొదలు కానున్న 3వ టెస్టు కోసం ఇప్పటికే టీమ్ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. నెట్స్‌లో తొలుత యశస్వి, రాహుల్‌ ఆ తర్వాతనే కోహ్లి, రోహిత్‌ బ్యాటింగ్‌కు దిగడం కనబడుతోంది.

ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించడం ప్రత్యేకతని సంతరించుకుంది. రోహిత్ తిరిగి తన ఓపెనింగ్ స్థానంలోనే ఆడాలి... అదే మంచి నిర్ణయం. రాహుల్ నిజానికి ఓపెనింగ్ స్థానాన్ని ఎందుకు త్యాగం చేయకూడదు. పెర్త్ టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోవడం వల్లనే కదా.. రాహుల్ అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి రోహిత్ మరలా ఓపెనర్ గా ఆడాలి అంటూ ఈ మాజీ క్రికెటర్ కామెంట్స్ చేశాడు. కాగా "బ్రిస్బేన్‌ టెస్టుకు అడిలైడ్‌లో సన్నాహాలు మొదలయ్యాయి" అంటూ సోషల్ వేదికగా టీమ్‌ఇండియా సాధన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే, ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు ముగిసినప్పటికీ ఈ మ్యాచ్ తాలూకు గాయాలు మాత్రం నేటికీ ఇంకా టీమిండియాను వెంటాడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: