అవును, మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. పూజార కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. విషయం ఏమిటంటే... ఆస్ట్రేలియాలోని బౌన్సీ, పేస్ పిచ్ లపై టీమిండియా టాలెంటెడ్ బ్యాట్స్ మెన్ కోహ్లీ తడబాటుకు గురవ్వడం వలన మాజీ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరుని పుజారా తప్పు బట్టాడు. స్వింగ్ అవుతున్న బంతులను ఆడడం కోహ్లీ వలన కావడం లేదని, కొత్త బంతిని ఎదుర్కొనేటప్పుడు కోహ్లీ టెక్నిక్ వర్కవుట్ కావడం లేదని విమర్శించాడు. ఇక మూడో టెస్టులో అయితే కోహ్లీ బ్యాటింగ్ దారుణంగా ఉందని, కొత్త బంతిని ఎదుర్కొనే క్రమంలో కోహ్లీ పేలవంగా ఆడుతూ, అర్ధాంతరంగా అవుటవుతున్నాడని విశ్లేషించాడు.

ఇక పాత బంతిని ఎదుర్కోవడంలో మాత్రం కోహ్లీ సరియైన ఆటతీరు కనబరుస్తున్నాడని, కానీ కొత్తరకం స్టైల్ బంతుల్ని ఎదుర్కోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడని అన్నాడు. ఇంకా పుజారా మాట్లాడుతూ... "కోహ్లీ టెక్నిక్ కొత్త బంతిని ఎదుర్కొనేందుకు తగినట్టుగా కనిపించడం లేదు. కోహ్లీ బ్యాటింగ్ చేయాల్సి వస్తే 10 ఓవర్ల తర్వాతో, 15 ఓవర్ల తర్వాతో, లేక 20 ఓవర్ల తర్వాతో రావాలేమో. ఫాస్ట్ బౌలర్లు ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్న సమయంలో అలసిపోకుండా బౌలింగ్ చేస్తారు. ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం ఏమంత సులభం కాదు. కోహ్లీకి అదే ప్రతికూలంగా మారుతోంది. కోహ్లీ నెట్స్ లో ఎంతో శ్రమిస్తుంటాడు... కానీ నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన టెక్నిక్స్ ను మ్యాచ్ కు అన్వయించడంలో మాత్రం విఫలమవుతున్నాడు!" అని పుజారా వివరించాడు.

ఇకపోతే, బ్రిస్బేన్ లో జరుగుతున్న 3వ టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులే చేసి హేజిల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకు మునుపు, రెండో టెస్టులో కూడా కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అడిలైడ్ లో జరిగిన ఆ పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 7, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులు మాత్రమే చేయడం అతని పేలవమైన ఆట తీరుని సూచిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: