అవును, అలా సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్ కావడానికి మొదటి కారణం సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా అని గుసగుసలు వినబడుతున్నాయి. బ్రిస్బేన్ టెస్టులో జడేజా వలనే టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకున్న సంగతి విదితమే. 77 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టును కాపాడిన జడేజాను మెల్‌బోర్న్, సిడ్నీలో జరిగే టెస్టుల్లో అయితే పక్కనపెట్టే అవకాశం లేదు. మరోవైపు మెల్‌బోర్న్, సిడ్నీ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే అంచనాలు ఉన్నాయి కాబట్టి, రెండో స్పిన్నర్‌గా బ్యాటింగ్ చేసే వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకు రావడం తప్పకుండా జరుగుతుంది. దాంతో చివరి 2 మ్యాచ్‌ల్లో చోటు దక్కడం కష్టమని బావించిన అశ్విన్.. రిటైర్‌మెంట్ ప్రకటించడం బెటర్ అని ఫీల్ అయ్యి ఉంటాడని విశ్లేషకులు అనుకుంటున్నారు.
అవును, ఇక అశ్విన్‌తో పోలిస్తే సుందర్ బాగా బ్యాటింగ్ చేస్తాడనే విషయం అందరికీ తెలిసినదే. మరోవైపు అశ్విన్ చరమాంక దశలో ఉండడంతో.. టీమిండియా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కూడా సుందర్‌కు మెండుగా అవకాశాలు కల్పిస్తోంది. అశ్విన్ స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలనేది బీసీసీఐ ఆలోచన అయ్యి ఉండొచ్చు. అయితే ఇప్పటికే వన్డే, టీ20ల తుది జట్టులో అశ్విన్ కనబడడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు ఇప్పట్లో భారత జట్టుకు టెస్టు సిరీస్‌లు కూడా పెద్దగా లేవు. ఇవన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇకపోతే అశ్విన్ భారత్ తరఫున 106 టెస్టుల్లో 537, 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 3503 పరుగులు చేసిన అశ్విన్ 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు కొట్టడం విశేషం.