అదేంటి... బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సంపాదించడమా? అదెట్టా సాధ్యం? అని అనుకుంటున్నారా? అదెలా సాధ్యమో తెలియాలంటే ఈ పూర్తి కధనం చదవాల్సిందే... బేసిగ్గా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అనేది సదరు ప్లేయర్ బ్యాట్ లేదా బాల్‌తో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసినపుడు మాత్రమే ప్లేయర్‌కు ఇస్తారు. అయితే, ఒక ఆటగాడు కేవలం అలాంటి ప్రత్యేకతలు లేకుండా, అసాధారణ ఫీల్డింగ్ చేసాడు. ఈ క్రమంలోనే అతగాడు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ఆ ఆటగాడు మ్యాచ్ సమయంలో బౌలింగ్ చేయలేదు లేదా బ్యాటింగ్ అస్సలు చేయలేదు మరి. అయితే క్రికెట్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు విశ్లేషకులు.

అయితే ఇది తాజా కథ కాదండోయ్.. 1986 అంటే అప్పటికి మీరు బహుశా పుట్టకపోవచ్చు. ఆ సంవత్సరంలో పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో... వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గుస్ లోగీ బ్యాటింగ్, బౌలింగ్ అనేది చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అవును, షార్జా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో, అతను 3 అద్భుతమైన క్యాచ్‌లు, రెండు రనౌట్‌లు చేయడంతో ఈ అరుదైన అవార్డుని స్వీకరించాడు. కాగా ఇప్పుడు అది ట్రెండింగ్‌లో ఉంది. లోగీ అసాధారణమైన క్యాచ్‌లతో పాకిస్థాన్ ఓపెనర్లను, ఇజాజ్ అహ్మద్‌ను అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఆసిఫ్ ముజ్తబాను రనౌట్ చేసి, స్క్వేర్ లెగ్ నుండి నేరుగా స్టంప్స్‌పై కొట్టి జావేద్ మియాందాద్‌ను పెవిలియన్‌కు పంపాడు.

తద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయకుండానే ఫీల్డర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న క్రీడాకారుడిగా చరిత్ర లిఖించాడు. వెస్టిండీస్ విజయవంతంగా పాకిస్థాన్‌ను 143 పరుగులకు ఆలౌట్ చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం కూడా అమోఘం. ఇక లోగీ విషయానికొస్తే 52 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 158 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 3 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. అంతే కాకుండా, అతను 2004 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్‌కు శిక్షణ కూడా ఇచ్చాడు. అదనంగా, అతను 1983 క్రికెట్ ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన వెస్ట్ ఇండియన్ స్క్వాడ్‌లో సభ్యుడు కూడా అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: