ఇక అసలు విషయానికి వస్తే, కోహ్లీ గనుక పాకిస్థాన్‌తో జరిగే ఆ హై-స్టేక్స్ మ్యాచ్‌లో ఆడితే, అది అతని కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ అవుతుంది. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ఒక క్రికెటర్‌గా అతని అంకితభావం, ఫిట్‌నెస్, స్థిరత్వం, నైపుణ్యానికి ఇది నిదర్శనం. ప్రస్తుతం 295 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ, త్వరలో 300 వన్డేల క్లబ్‌లో చేరనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే ఈ సిరీస్‌లో పాల్గొంటాడు.
అలా జరిగితే, అతని వన్డేల సంఖ్య 298కి చేరుతుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ అతని 299వ వన్డే అవుతుంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడితే, అది అతని కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ అవుతుంది.
ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఫిబ్రవరి 6న వడోదరలో మొదటి వన్డే, ఫిబ్రవరి 9న ఒడిశాలో రెండవ వన్డే, ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో మూడవ వన్డే జరుగుతాయి. ఈ సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం జరుగుతుంది. మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.