అవును, 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోర్బిన్ బాష్ 93 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రంలో 4 వికెట్లు, అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నమోదు చేసాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా కూడా అరుదైన రికార్డు సృష్టించాడు. అంతకు మునుపు ఈ రికార్డు మిలన్ రత్నాయకే (72) పేరిట ఉండేది.
ఇక, మ్యాచ్ విషయంలోకి వెళితే... తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 211 పరుగులకే చాపచుట్టేసింది. 82/3తో రెండో రోజు (శుక్రవారం) ఆటను ప్రారంభించిన సఫారీలు.. 301 పరుగులు చేయడం గమనార్హం. ఓపెనర్ మార్‌క్రమ్ (89; 144 బంతుల్లో) రాణించగా.. టాప్ ఆర్డర్‌లో మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేసిన దాఖలాలు లేవు. బావుమా (31), బెడింగ్‌హామ్ (30) పరుగులు చేయగా... స్కోరు 213 పరుగుల వద్ద మార్‌క్రమ్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోర్బిన్ బాష్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు 90 పరుగుల ఆధిక్యం సాధించగలిగింది. రబాడ (13), ప్యాటర్సన్ (12).. కోర్బిన్‌కు సహకరించారు.
టెస్టుల్లో అరంగేట్రంలోనే 9వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లు వీరే:
కోర్బిన్ బాష్ (దక్షిణాఫ్రికా) - 92 బంతుల్లో 81 (పాకిస్థాన్‌పై, 2024)
మిలన్ రత్నాయకే (శ్రీలంక) - 135 బంతుల్లో 72 (ఇంగ్లాండ్‌పై, 2024)
బల్వీందర్ సంధు (భారత్) - 88 బంతుల్లో 71 (పాకిస్థాన్‌పై, 1983)
జోండేకి (దక్షిణాఫ్రికా) - (128 బంతుల్లో 59) (ఇంగ్లాండ్‌పై, 2003)