కోనేరు హంపి 2023లో సమ్మర్ కండ్ ర్యాపిడ్ ఛాంపియన్లలో ట్రై బ్రేక్ లలో విన్నర్ గా నిలవలేకపోయిందట. అనస్తాసియా బోడ్నరుక్ చేతిలో ఈమె ఓడిపోవడం జరిగింది.. అయితే 2019లో మాస్కోలో అగ్రస్థానంలో కూడా విజేతగా కోనేరు హంపి నిలిచింది.. కోనేరు హంపి ఆ తర్వాత ఇది రెండవసారి ప్రపంచ రాపిడ్ టైటిల్ ని గెలుచుకోవడంతో భారత్ ప్రజలు కూడా ఆనందిస్తున్నారు. అయితే వ్యక్తిగత కారణాలవల్ల భారత్ చారిత్రాత్మక డబుల్ స్వర్ణాన్ని గెలుచుకున్న ఈమె బుడ ఒలంపిక్స్ యాడ్లో కోనేరు హంపి దూరమైందట.
అయితే 2024లో రాపిడ్ టైటిల్ తో ఘనంగా రియంట్రి ఇచ్చింది కోనేరు హంపి. ఈవెంట్ చివరి రౌండులో హంపి తో పాటుగా ఆరు మంది క్రీడాకారుల సైతం పోటీ ఇచ్చారు. అందులో జువెన్ జున్ , టాన్ జాంగ్వి, అఫ్రూజా ఖమ్దమోదవా, కాటే రినా లగ్నో, హారిక ద్రోణవల్లి , ఐరిన్.. వీరందరూ కూడా 10 రౌండ్లలో 7.5 పాయింట్లు టోర్నమెంటులో ముందంజలో ఉన్నారట. కాని చివరికి మాత్రం కోనేరు హంపి 8.5 పాయింట్లతో ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచింది. ఈమె ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ ప్రాంతంలో జన్మించింది. దీంతో చాలామంది ఏపీ ప్రజలు ఆమెను ప్రశంసించడమే కాకుండా.. పలువురు రాజకీయ నేతలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఏపీలో అంతా కూడా ఈమె పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.