భారత ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని నాలుగో టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన నితీష్, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఓ బౌండరీతో 100 రన్స్ పూర్తి చేసుకున్నాడు.

భారత జట్టు 221 రన్స్‌కే 7 వికెట్లు నష్టపోయి ఓటమి దిశగా వెళ్తున్నప్పుడు, నితీష్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్ సేనను గట్టెక్కించాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 8వ వికెట్‌కు 127 రన్స్ పార్ట్‌నర్‌షిప్ అందించి భారత జట్టును ఫాలో ఆన్ నుంచి రక్షించాడు. సుందర్, బుమ్రా పెవిలియన్ బాట పట్టాక కూడా సిరాజ్ తో కలిసి విధ్వంసం సృష్టించాడు నితీష్. అయితే, నితీష్ సెంచరీ చేసిన తర్వాత, కొందరు సోషల్ మీడియాలో అతని కులం గురించి చర్చించడం మొదలుపెట్టారు. అతను అసలు రెడ్డి కాదని కొందరు, అతను రెడ్డినే అని మరికొందరు వాదిస్తున్నారు.

నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో హీరో అయ్యాడు కానీ, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ మొదలైంది. కొందరు అతను రెడ్డి కాదని, మత్స్యకార కులానికి చెందిన 'రెడ్డిక' సామాజిక వర్గానికి చెందినవాడని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఈ వర్గం ఎక్కువగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం వీరిని ఎంబీసీలుగా గుర్తించింది. వెనుకబడిన వర్గం నుండి వచ్చి జాతీయ జట్టులో స్థానం సంపాదించడం గొప్ప విషయం, కానీ నితీష్ జాగ్రత్తగా ఉండాలని కొందరు సలహా ఇస్తున్నారు.

ముంబైకి చెందిన సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి వాళ్ళు నితీష్‌ను విమర్శిస్తున్నారని, భవిష్యత్తులో అతనికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. వాళ్ళు కామెంటరీ చేసే విధానమే దీనికి నిదర్శనం అంటున్నారు. ఇక, నితీష్‌కు సినిమా పిచ్చి కూడా ఎక్కువే. అతను మహేష్ బాబు అభిమాని అని చెప్పడంతో, మహేష్ ఫ్యాన్స్ 'మా వాడు' అని సంబరపడుతున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అతను తమ హీరో ఫ్యాన్ అని వాదిస్తున్నారు. అంతేకాదు, నితీష్ తండ్రి బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ గొడవలు చూసి నెటిజన్లు విసుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: