ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, మిగిలిన ఒక స్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మూడు జట్ల సమీకరణాలు చూద్దాం.

భారత్:

టీమిండియా ప్రస్తుతం 55.89 శాతంతో ఉంది. ఆస్ట్రేలియాతో రెండు కీలకమైన టెస్టులు ఆడాల్సి ఉంది (మెల్‌బోర్న్, సిడ్నీలో). ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే క్లీన్ స్వీప్ చేస్తే (రెండు టెస్టుల్లో గెలిస్తే) తిరుగుండదు! 60.53 శాతంతో ఫైనల్ బెర్త్ కొట్టేస్తుంది. ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకుంటే 57.02 శాతంతో నిలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, శ్రీలంకతో జరిగే సిరీస్‌లో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేస్తే, భారత్ వెనుకబడిపోవచ్చు. ఒకటి గెలిచి, ఒకటి ఓడిపోతే: 55.26 శాతానికి పడిపోతుంది. అప్పుడు శ్రీలంక, ఆస్ట్రేలియాను కనీసం 1-0తో ఓడిస్తేనే భారత్‌కు ఛాన్స్ ఉంటుంది.

రెండు టెస్టులు డ్రా చేసుకుంటే 53.51 శాతంతో నిలుస్తుంది. అప్పుడు శ్రీలంక (ఆస్ట్రేలియాను 2-0తో ఓడిస్తే) లేదా ఆస్ట్రేలియా (శ్రీలంకలో కనీసం ఒక మ్యాచ్ గెలిస్తే) భారత్‌ను వెనక్కి నెట్టేస్తాయి. ఒకటి ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంటే ఇక అంతే సంగతులు! 51.75 శాతానికి పడిపోయి, ఫైనల్ రేసు నుండి నిష్క్రమిస్తుంది.

• ఆస్ట్రేలియా:

ఆసీస్ ప్రస్తుతం 58.89 శాతంతో పటిష్ట స్థానంలో ఉంది. భారత్‌తో రెండు (స్వదేశంలో), శ్రీలంకతో రెండు (విదేశాల్లో) టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్ బెర్త్ కోసం భారత్‌ను క్లీన్ స్వీప్ చేస్తే శ్రీలంకలో ఫలితాలతో సంబంధం లేకుండా 57.02 శాతంతో ఫైనల్‌కు దూసుకెళ్తుంది.

భారత్‌పై ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకుంటే: శ్రీలంకలో రెండు టెస్టుల్లో ఓడిపోయినా, భారత్‌ కంటే ముందుంటుంది. కానీ శ్రీలంక 2-0తో గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. భారత్‌తో రెండు టెస్టులు డ్రా చేసుకుంటే ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకలో కనీసం ఒక మ్యాచ్‌లో అయినా గెలవాలి. భారత్‌తో ఒకటి ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంటే ఫైనల్ బెర్త్ కోసం శ్రీలంకను క్లీన్ స్వీప్ చేయాల్సిందే. భారత్‌తో రెండు టెస్టుల్లో ఓడిపోతే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

• శ్రీలంక:

లంక పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది. ప్రస్తుతం 45.45 శాతంతో ఉంది. ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు (స్వదేశంలో) ఆడాల్సి ఉంది. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేస్తే 53.85 శాతానికి చేరుకుంటుంది. అప్పుడు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లు డ్రా కావాలి, లేదా ఆస్ట్రేలియా భారత్‌పై ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకోవాలి. అప్పుడే లంకకు ఛాన్స్ ఉంటుంది.

ఇతర ఏ సందర్భంలోనైనా, భారత్ లేదా ఆస్ట్రేలియా ఎక్కువ శాతంతో ఫైనల్‌కు చేరుకుంటాయి, శ్రీలంక ఇంటిదారి పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: