ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ 3వ ఎడిషన్ ఫైనల్ రేసు చాలా ఉత్కంఠగా జరిగింది. తాజా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టిక్కెట్ కోసం 3 జట్ల మధ్య అయితే ఇపుడు తీవ్ర పోటీ స్పష్టమైపోయింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ రేసులోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించి WTC ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. థెంబా బావుమా నేతృత్వంలోని జట్టు పాకిస్థాన్‌పై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేవలం 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి టైటిల్‌ మ్యాచ్‌కు టిక్కెట్‌ను రిజర్వ్ చేసుకుంది. సెంచూరియన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు, కగిసో రబడ, మార్కో జాన్సన్ 9వ వికెట్‌కు అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించిందనే విషయం అందరికీ తెలిసిందే.

మరోవైపు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా, ఆఫ్రికా జట్టు WTC ఫైనల్స్‌కు చేరుకొనే అవకాశం లేకపోలేదు. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. అదంతా పక్కన పెడితే... టీమిండియా 55.88 విజయ శాతంతో 3వ స్థానంలో కొనసాగుతూ ఉండగా ఆసీస్ 58.89 విజయ శాతంతో రెండో ప్లేస్‌లో ఉంది. టీమిండియా BGT ట్రోపీని గెలిస్తేనే ఫైనల్‌‌కి చేరుకొనే అవకాశం ఉంది.. లేకపోతే లేదు.. అన్న అనుమానాలు లేకపోలేదు. అవును... ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్‌కు చేరాలంటే భారత్ మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి. భారత్ అదృష్టం బాగుంది గెలిస్తే 60.53% పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంది... లేదా మ్యాచ్ డ్రా అయితే మాత్రం భారత్ ఖాతాలో 57.02% పాయింట్లు ఉంటాయి. ఆతరువాత డబ్ల్యూటీసీ అర్హత కోసం శ్రీలంక ఒక విజయం సాధించాలని కోరుకోవాలి.

మరో పక్క టీమిండియా ఒక టెస్టులో ఓడి, మరొకటి గెలిచినప్పటికీ WTC ఫైనల్‌కు చేరుకొనే అవకాశం లేకపోలేదు. అయితే శ్రీలంకతో జరిగిన 2 టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక WTC ఫైనల్‌కు చేరుకోవడానికి ఆస్ట్రేలియా కూడా శ్రీలంకలో 2 టెస్టులు ఆడాల్సి ఉందనే విషయం ఉంది అందరికీ తెలిసినదే. అయితే శ్రీలంకతో జరిగే మిగిలిన 2 టెస్టులు డ్రాగా మారినా కూడా ఆస్ట్రేలియానే ఫైనల్ చేరుకుంటుందనే విషయం స్పష్టం అయిపోయింది. మరోవైపు, మెల్‌బోర్న్, సిడ్నీలలో ఆస్ట్రేలియా ఓడిపోతే, ఆ జట్టు ఫైనల్స్‌కు చేరుకునే రేసు నుంచి తప్పుకుంటుంది. చూడాలి మరి.. ఆఖరికి ఏం జరుగుతుందో? విశ్లేషకులు మాత్రం భారత్ కి కష్టమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు! మీరు ఏమంటుకుంటున్నారో ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: