బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. ఇప్పటికి తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ ఎక్కడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌పై ఏకంగా 333 పరుగుల ఆధిక్యతను సాధించింది అంటే సాధారణమైన విషయం కాదు. చిట్టచివరి బ్యాటర్లు అయినటువంటి నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.. క్రీజ్‌లో స్టేబుల్ గా ఆడుతుండడం విశేషం. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగును చాలా జాగ్రత్తగా చేస్తూ స్కోర్ బోర్డ్‌ని పరుగెత్తించారు. 65వ ఓవర్‌లో ఎనిమిదో వికెట్ పడితే 82 ఓవర్ ముగిసేంత వరకూ కూడా మరో వికెట్ పడకపోవడం విశేషంగానే చెప్పుకోవచ్చు.

అవును, అన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే సాధారణమైన విషయం కాదంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాథన్ లియాన్ 54 బంతులను గాను 41 పరుగులు చేయగా అందులో అయిదు ఫోర్లు ఉండడం విశేషం. ఇక స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనగా ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో రోజు నాటౌట్‌గా మిగలడం గమనార్హం. ఇలా ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొన్నారు. ఇది రికార్డ్ పార్ట్‌నర్‌షిప్ అనే అంటున్నారంతా. తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు చేయడాన్ని అసాధారణంగా భావిస్తోన్నారు క్రీడా పండితులు మరి. బోలాండ్ వంటి బ్యాటర్ టీమిండియా బౌలర్లను 65 బంతుల పాటు ధీటుగా ఎదుర్కొనడం ఇపుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇక విషయంలోకి వెళితే... కేప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను పదేపదే మార్చినా ఇక్కడ ఉపయోగం లేకుండా పోయింది. బుమ్రా బౌలింగ్ అయితే బాగా తేలిపోయింది. మరోవైపు బాగా అలసిపోయినట్టు క్రీడా మైదానంలో కనబడ్డాడు. ఇన్నింగ్ చివరి ఓవర్‌ నాలుగో బంతికి నాథన్ లియాన్ అవుట్ అయినప్పటికీ అది నో బాల్ కావడంతో తీవ్ర నిరాశను మిగిల్చింది. బుమ్రా వేసిన లెంగ్తీ డెలివరీని లియాన్ డిఫెన్స్ అడగా థిక్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి థర్డ్ స్లిప్ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడే ఉన్న కేఎల్ రాహుల్ దాన్ని పట్టుకున్నాడు. అక్కడితో ఇన్నింగ్‌కు తెరపడిందని అందరూ అనుకున్నప్పటికీ అది నో బాల్ అయ్యి షాక్ ఇచ్చింది. లేక లేక వికెట్‌ను తీసుకున్న ఆ బంతి నో బాల్ కావడం అటు ప్లేయర్లు, ఇటు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మరోవైపు బుమ్రా అయితే చాలా బాధగా చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. నిరాశతో బంతిని అందుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతిని లియాన్ ఫోర్‌గా మలచడం హైలైట్‌గా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తీవ్రమైన నిరాశ బుమ్రా ప్రదర్శించడంతో ఒకరకమైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: