అసలు విషయంలోకి వెళితే, బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఏకంగా 10 సార్లు గెలిచిన టీమిండియా ఈసారి మాత్రం చాలా ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఎన్నో చేదు అనుభవాలను భారత క్రీడాకారులకు ఇచ్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్నింటికీ మించి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ బ్యాట్స్ మన్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ ఒక చేదు అనుభవంలా మిగిలిపోతుంది. ఈ 5 టెస్టుల సిరీస్ లో 9 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ 190 పరుగులు మాత్రమే పరుగులు చేయడం విచారకరం.
అవును... పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ... ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. జట్టుకు అవసరమైన సమయంలో కోహ్లీ ఫెయిల్ కావడంతో టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. టీమిండియాకు సూపర్ స్టార్ సంస్కృతి అవసరం లేదని విమర్శించాడు. కోహ్లీ స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో విమర్శల నడుమ రోహిత్ ఆఖరికి ట్రోఫీ పూర్తికాకమునుపే అటనుండి నిష్క్రమించాడు.