గత కొంత కాలంగా భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే దానికి కారణం లేకపోలేదు... సామాజిక మాధ్యమ ఖాతాలలో ఒకరినొకరు మొదట అన్ ఫాలో చేసారు. అక్కడినుండే వారిద్దరు విడిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయింది. మరోవైపు జాతీయ మీడియా కూడా ఈ వ్యవహారంపై పలు కథనాలను ప్రసారం చేయడంతో ఈ పుకార్లకు ఊతం ఏర్పడింది. అయినప్పటికీ విడాకుల వ్యవహారంపై అటు చాహల్, ఇటు ధనశ్రీ ఇంతవరకు నోరు విప్పకపోవడం గమనార్హం.

ముఖ్యంగా జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం చాహల్, ధనశ్రీ కొంత కాలంగా వేరువేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే? ఇప్పటికే వారిద్దరూ తమ న్యాయవాదులను విడాకుల కోసం సంప్రదించారని వినికిడి. అయితే మొన్నటిదాకా చిలకా గోరింకల్లాగా కలిసి ఉన్న వారిద్దరు.. సడెన్ గా విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఐపిఎల్ లో చాహల్ ఆడిన మ్యాచ్ లన్నింటికీ ధనశ్రీ హాజరై, చాలా ఎంకరేజ్ చేసిన సంగతి విదితమే. మరోవైపు, ఆ మధ్య ధనశ్రీ పాల్గొన్న డ్యాన్స్ రియాల్టీ షో లోనూ చాహల్ కనిపించాడు. చివరికి చాహల్ ను ఎత్తుకొని ధనశ్రీ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సంచలనం కావడంతో అవన్నీ వట్టి పుకార్లే అనుకున్నారు.

అయితే అన్యోన్యంగా ఉన్న వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధం అంటూ మరోమారు కధనాలు వెలువడడంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. విషయం ఏమిటంటే? ధనశ్రీ కొంతకాలంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ తో చనువుగా ఉంటుందని గుసగుసలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో కనిపించడంతో ధనశ్రీపై చాహల్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అయితే అదే ఫోటోని మరలా ఇపుడు చాహల్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ... "హద్దుల్లో ఉండు. అతడు నిన్ను పూర్తిగా నమ్మాడు. నువ్వేమో మోసం చేస్తున్నావ్. నీకు ఎంత స్నేహితుడైతే మాత్రం ఇలా కొగిలించుకోవలసిన అవసరం ఉండ? కొంచెం పద్ధతిలో ఉండు!" అని హెచ్చరించారు. వాస్తవానికి ఈ ఫోటో బయటికి వచ్చిన తర్వాతే యజువేంద్ర చాహల్ కూడా ధనశ్రీని మందలించాడట. అప్పటి నుంచే వారిద్దరి మధ్య ఎడం పెరిగి పెరిగి... విడాకులు వరకు వచ్చిందని వినికిడి!

మరింత సమాచారం తెలుసుకోండి: