క్రికెట్, క్రీడ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలో సినిమా రంగం తరువాత అంతలా ప్రాచుర్యం పొందిన ఏదైనా రంగం ఉంది అంటే.. అది క్రికెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇక్కడ క్రికెటర్లు కూడా సెలబ్రిటీలకు ధీటుగా గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఇక వారి ఆదాయం గురించి కూడా ఇక్కడ చెప్పనక్కర్లేదు. అదే సమయంలో వీరు వైవాహిక జీవితాలు కూడా అప్పుడప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. దానికి కారణం తెలిసిందే. క్రికెటర్లలో కొంతమంది దీర్ఘకాలం తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తే, మరికొంతమంది మాత్రం రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ ఉంటారు. ఇక అలాంటి వారి లిస్ట్ ఇక్కడ పెద్దది గానే ఉంది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత చర్చనీయాంశమైన విడాకుల జంటల గురించి ఇక్కడ తెలుసుకుందాం. హార్దిక్ పాండ్యా నుండి శిఖర్ ధావన్ వరకు, ఈ క్రికెటర్లు ఎన్నో వైవాహిక సవాళ్లను ఎదుర్కొన్నారు.

వీరిలో మొదటి జంట మహ్మద్ "అజారుద్దీన్ మరియు నౌరీన్" గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. భారత మాజీ కెప్టెన్, మొహమ్మద్ అజారుద్దీన్, 1987లో నౌరీన్‌తో మూడు అడుగులు వేశారు. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత, అంటే సరిగ్గా 1996లో వారు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అయితే అజహర్ ఆ తరువాత బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకోగా వారు కూడా విడిపోయారు.

ఈ లిస్టులో రెండవ వారు "దినేష్ కార్తీక్ మరియు నికితా వంజర." 2012లో నికితా వంజర నుండి దినేష్ కార్తీక్ విడాకులు తీసుకోవడం మొత్తం మీడియాలోనే హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే, వీరు విడిపోయిన కొద్దిసేపటికే, నికిత సహచరుడు మురళీ విజయ్‌ని వివాహం చేసుకోవడంతో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆ తరువాత కాలంలో కార్తీక్, స్క్వాష్ ఛాంపియన్ దీపికా పల్లికల్‌తో మళ్లీ ప్రేమలో పడి కొత్త భాగస్వామితో ప్రస్తుతం కలిసి ఉంటున్నాడు.

ఇక మూడవ జంట "షేన్ వార్న్ మరియు సిమోన్ కల్లాహన్." పెళ్ళైన సరిగ్గా 10 సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరియు సిమోన్ కల్లాహన్ 2005లో విడాకులు తీసుకున్నారు. అయితే వారు విడిపోయిన తర్వాత కూడా, నిబద్ధతతో సహ-తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతలు ఎత్తుతున్నారు. అయితే 2022లో వార్న్ అకాల మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది.

ఈ లిస్టులో 4వ జంట "ఇమ్రాన్ ఖాన్ మరియు జెమీమా గోల్డ్ స్మిత్." ఇమ్రాన్ ఖాన్, మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు పాక్ మాజీ రాజకీయ ప్రముఖుడు. ఈయన 1995లో బ్రిటీష్ సామాజికవర్గానికి చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకోగా... దాదాపు 9 ఏళ్ళు కలిసి ఉండి, 2004లో విడిపోయారు.

ఈ లిస్టులో 5వ జంట "శిఖర్ ధావన్ మరియు అయేషా ముఖర్జీ." భారత క్రికెటర్ శిఖర్ ధావన్ మరియు అతని భార్య అయేషా ముఖర్జీ వివాహం ఎనిమిదేళ్ల తర్వాత తాజాగా విడిపోయారు.

"హార్దిక్ పాండ్యా మరియు నటాసా స్టాంకోవిచ్"ని ఈ లిస్టులో 6వ జంటగా పేర్కొనవచ్చు. 2020లో ఈ జంట  చేసుకుని, 2023 ప్రేమికుల రోజున ఉదయపూర్‌లో విలాసవంతమైన చోట క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత వారు వారి వైవాహిక బంధానికి టాటా చెప్పేసారు.

ఈ లిస్టులో 7వ జంట "షోయబ్ మాలిక్ మరియు అయేషా సిద్ధిఖీ, సానియా మీర్జా." భారత టెన్నిస్ స్టార్ అయినటువంటి సానియా మీర్జాను పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకే వారు విడిపోయారు. అయితే వారికి బాబు ఉన్నాడు.

ఈ లిస్టులో ఆఖరివారు.. అంటే తాజాగా వార్తల్లోకి ఎక్కినవారు.. భారత క్రికెటర్ "యజువేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ." అవును, ప్రస్తుతం వారు విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. సామాజిక మాధ్యమ ఖాతాలలో ఒకరినొకరు మొదట అన్ ఫాలో చేసిననాటినుండి, ఈ వార్త హల్ చల్ చేస్తోంది. అయినప్పటికీ విడాకుల వ్యవహారంపై అటు చాహల్, ఇటు ధనశ్రీ ఇంతవరకు నోరు విప్పకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: