అయితే ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడమని ఈసీబీ చెప్పడానికి ఓ రీజన్ ఉంది. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ సర్కారు ఆగడాల మీద ఇంగ్లండ్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఆఫ్ఘాన్ టీమ్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్ బోర్డుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. మ్యాచ్ ఆడొద్దంటూ 160 మందికి పైగా అక్కడి నేతలు ఈసీబీకి అల్టిమేటం జారీ చేయడం కొసమెరుపు. దానికి కారణం తాలిబన్ల ఏలుబడి అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్ఘానిస్థాన్‌లో మహిళలు, బాలికల మీద తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. బాలికలు ఆరో తరగతికి మించి చదవకూడదని రూల్ విధించారు. అదేవిధంగా స్త్రీలు జాబ్స్ చేయొద్దని, జిమ్, పార్కులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో కనిపించకూడదని స్ట్రిక్ట్ రూల్స్ వేశారు. క్రీడల్లోనూ అక్కడి మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.