ఇలా సోషల్ మీడియాలో వ్యవహరించడం సెలబ్రిటీల్లో కొత్తేమీ కాదు. కొద్ది రోజుల క్రితమే, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు హాట్ టాపిక్‌లుగా ఎలా మారుతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
మనీష్, ఆశ్రిత చాలా కాలంగా బయట ఎక్కడా కలిసి కనిపించలేదు. ఈవెంట్లకు, పార్టీలకు వారిద్దరూ దూరంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. వారి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా అని అభిమానులు తెగ బాధపడుతున్నారు.
ఈ జంట 2019 డిసెంబర్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారి లవ్ స్టోరీ బాగా వైరల్ అయింది ఆశ్రిత చాలా అందంగా ఉంటుంది. అందుకే ఆమెకు భార్య తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. వీరిద్దరూ చూడడానికి చాలా ముచ్చటగా కనిపిస్తారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి వార్తలు వినిపించడం వారిని అభిమానించే వారందరికీ షాకింగ్‌గా మారింది.
మనీష్ తన కెరీర్‌లోనూ కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టు నుంచి అతన్ని తప్పించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలతో అతను ఎలా బాధపడుతున్నాడో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మనీష్, ఆశ్రిత ఇద్దరూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. వారి మౌనం మరిన్ని అనుమానాలను పెంచుతుంది. ఈ పుకార్లపై ఒక అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ జంట మాత్రం ఇంకా స్పందించలేదు. చూడాలి ఈ పుకార్లను కొట్టి పారేస్తారో, లేదంటే బాంబు పేలుస్తారో!