అవును.. స్టేడియాలు సిద్ధంగా లేకపోవడంతో పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వేరే దేశానికి వెళ్లనుందా? అనే అనుమానపు వార్తలపై పీసీబీ స్పందించింది. సుమారు 12 బిలియన్(పాక్ రూపాయలు) వెచ్చించి స్టేడియాల్ని సిద్ధం చేశామని, దీనిపై అనుమానం వద్దని స్పష్టం చేసింది. ఇక స్టేడియాల సన్నద్ధతపై నెలకొన్న అనుమానపు వార్తల కారణంగా ఎవ్వరిలో కూడా గందరగోళం ఉండకూడదనే ప్రకటన విడుదల చేశామని ఈ సందర్భంగా తెలిపింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని, టోర్నీ కచ్చితంగా జరుగుతుందని, ఈ విషయంలో ఎలాంటి వద్దని స్పష్టం చేసింది.
ఇకపోతే ఈ పనులన్నీ 2024 డిసెంబర్31లోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ, సమయం పడుతుండడంతో స్టేడియాల్లో ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయని వార్తలు గుప్పుమన్నాయి. సీట్ల పుణరుద్ధరణ నుంచి ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్స్రెనొవేషన్, హాస్పిటాలిటీ బాక్సెస్, ఫ్లడ్లైట్ల ఏర్పాట్లు సహా ఇతరత్రా సౌకర్యాలకు సంబంధించిన పనులేనీ పూర్తిగా కంప్లీట్ కావడం లేదని కొన్ని రోజులుగా వార్తలు, దానికి సంబందించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే PCB (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) స్పందించడం గమనార్హం. అయినప్పటికీ అంతకన్నా ముందు అసలు ఈ పుణరుద్ధరణ పనులు ఎక్కడి దాకా వచ్చిందో పరిశీలించేందుకు ఐసీసీ నుంచి ఓ బృందం త్వరలోనే పాకిస్థాన్ లో పర్యటించనుందని సమాచారం వస్తోంది.