
టీ20 ప్రపంచకప్ 2024 విజయం సాధించిన తరువాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన జడేజా.. వన్డే, టెస్ట్‌ల్లో ఇంకా కొనసాగుతున్నాడనే విషయం తెలిసిందే. ఇకపోతే జడేజా ఈమధ్య మ్యాచెస్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అటు బ్యాటర్‌గా.. ఇటు బౌలర్‌గా కూడా విఫలం అయ్యాడు. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌లు ఆడిన జడేజా, 4 వికెట్లు మాత్రమే తీసి 135 పరుగులే చేశాడు. దాంతో ఈ సిరీస్‌ను టీమిండియా 1-3తో ఆసీస్‌కు కోల్పోయింది. ఇక వన్డేల్లో కూడా సరియైన ప్రదర్శన చేయడం లేదు. ఈ క్రమంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించే పనిలో ఉన్నాడని గుసగుసలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో జడేజా సదరు జెర్సీ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్టు అయింది. దాంతోనే ఈ ఫొటోపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో "హ్యాపీ రిటైర్మెంట్ డే జడేజా" అని విష్ చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌తో 3 వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లకు ఎంపికయ్యే భారత జట్లలో జడేజాకు చోటు దక్కదనే ప్రచారం కూడా ఊపందుకుంది. అతనికి బదులు అక్షర్ పటేల్‌ను తీసుకోనే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జడేజా తన రిటైర్మెంట్పై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టడం విశేషం.