ముచ్చ‌ట‌గా 3వసారి ప్ర‌తిష్టాత్మ‌క బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని అందుకోవాలన్న టీమ్ఇండియా ఆశలు అడియాసలు అయ్యాయి. ఇక దాదాపు ప‌దేళ్ల త‌రువాత బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని గెలుచుకోవ‌డంతో ఆస్ట్రేలియా ఖుషీ అయిపోయింది. దాంతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ముగిసిపోవ‌డంతో ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఛాంపియ‌న్స్ ట్రోఫీ పై ప‌డింది. అవును... పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల్లో ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఆల‌స్యం కానున్న‌ట్లు 'క్రిక్‌బ‌జ్' తాజాగా పేర్కోవడంతో ఒకింత గండాగంగోళం ఏర్పడింది. అందుకనే ఈ నెల 12లోపు టీమ్‌ను ప్ర‌క‌టించాల్సి ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు బీసీసీఐ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయకపోవడం కొసమెరుపు.

ఈ క్ర‌మంలోనే ఐసీసీని గ‌డువు పొడిగించాల‌ని బీసీసీఐ అభ్య‌ర్థించిన్న‌ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన ఆలస్యం కావచ్చనే ఊహాగానాలు మీడియాలో మొదలయ్యాయి. ఈ నెల 18 లేదా 19న జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఉంటుందని ప్రచారంలో ఉండగా ఇంకా దానిపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇంగ్లండ్ తో స్వ‌దేశంలో వైట్-బాల్ సిరీస్ కోసం ఇవాళ లేదా రేపు జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశం ఉంది. ముందుగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుందనే విషయం అందరికీ తెలిసిందే.

సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్రమంలో మొత్తంగా 5 టీ20లు మ్యాచెస్ ఆడ‌నుంది. త‌ర్వాత 3 వ‌న్డేలు ఆడ‌నుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేప‌థ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారిని ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ వేదిక‌గా ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుండ‌గా, టీమ్ఇండియా ఆడే మ్యాచుల‌ను దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు. దాదాపుగా అన్ని జ‌ట్లు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనే స్వ్కాడ్‌ల‌ను ప్ర‌క‌టించాయి. ప్రస్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం... ఈ మెగా టోర్నీకి జ‌ట్టును ప్ర‌క‌టించేందుకు ఐసీసీ జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ టీమ్ఇండియా గెల‌వాల‌ని భార‌త అభిమానులు కోరుకుంటున్నారు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త షెడ్యూల్:
భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌ - ఫిబ్ర‌వ‌రి 20  
భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్‌ - ఫిబ్ర‌వ‌రి 23
భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ - మార్చి 2

మరింత సమాచారం తెలుసుకోండి: